అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోయే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు 200 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు 193.7 కోట్లకు చేరినట్లు సమాచారం.
ఇది ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ సాధించిన సినిమా కావడం విశేషం. ఎన్టీఆర్ (Jr NTR) -రామ్ చరణ్ (Ram Charan) లతో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ 224 కోట్ల బిజినెస్ చేసుకుంది. బిజినెస్ లెక్కల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ కంటే కాస్త వెనుకబడినా, ‘పుష్ప 2’ కొన్ని ప్రాంతాల్లో ముందువరుసలో నిలిచింది. ఉత్తరాంధ్రలో ‘ఆర్ఆర్ఆర్’ 23 కోట్ల బిజినెస్ సాధించగా, ‘పుష్ప 2’ 23.4 కోట్లతో దాన్ని దాటేసింది. అలాగే గుంటూరులో కూడా ‘పుష్ప 2’ ముందు నిలిచింది.
అయితే, సీడెడ్ ప్రాంతంలో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ పైనే ఆధిపత్యం నిలిచింది. అక్కడ 50 కోట్ల బిజినెస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే, ‘పుష్ప 2’కు 30 కోట్ల మాత్రమే సొంతమైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ప్రాంతాల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ దే ఆధిక్యం. నైజాం ఏరియాలో మాత్రం రెండు సినిమాలు సమానంగా 80 కోట్ల బిజినెస్ చేసుకోవడం విశేషం.
ఇప్పటివరకు వచ్చిన బిజినెస్ లెక్కలు చూస్తే, ‘పుష్ప 2’ కూడా భారీగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా గ్రాస్ అందికున్న విషయం తెలిసిందే.