Allu Arjun: అల్లు అర్జున్‌ స్టెప్పులు అక్కడ కూడా అదుర్స్‌!

‘పుష్ప’ సినిమాలో ‘శ్రీవల్లీ…’ పాటను షూట్‌ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌, శోభి మాస్టర్‌ – జానీ మాస్టర్‌, సుకుమార్ కూడా అనుకొని ఉండరు. ఆ చెప్పులు జారిపోయే స్టెప్‌ అంత హిట్‌ అవుతుంది అని. ఎవరూ ఊహించనంతగా ఆ స్టెప్‌ ఇప్పుడు అంతలా వైరల్‌ అవుతోంది. తొలినాళ్లలో టాలీవుడ్‌ స్టెప్పుల రీమేక్‌ స్పెషలిస్ట్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ‘పుష్ప’ డైలాగ్‌లు, స్టెప్‌ వేశాడు. ఎక్కువమంది అయితే ‘శ్రీవల్లి’ హుక్‌ స్టెప్‌ వేస్తున్నారు. అలా అలా ఇప్పుడు ఈ స్టెప్‌ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా కనిపించింది.

మొన్నామధ్య ‘పుష్ప’ సక్సెస్‌ మీట్‌లో సుకుమార్‌ మాట్లాడుతూ సినిమా బాక్స్‌లు నేపాల్‌ పంపించారు అని చెప్పారు. అక్కడ కూడా మా సినిమాకు క్రేజ్‌ ఉంది అనేలా మాట్లాడారు. ఆ విషయమేమో కానీ… సినిమాలోని డైలాగ్‌లు, స్టెప్పులకు మాత్రం భలే క్రేజ్‌ వచ్చేసింది. ముఖ్యంగా క్రికెటర్లు ఈ స్టెప్పులతో రెచ్చిపోతున్నారు. సురేశ్‌ రైనా, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌… ఇప్పటికే శ్రీవల్లి స్టెప్పేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. తాజాగా బంగంబంధు ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌లో శ్రీవల్లి స్టెప్‌ కనిపించింది.

క్రికెటర్‌ కమ్‌ డ్యాన్సర్‌ అయిన డీజే బ్రావో ఓ వికెట్‌ తీసిన ఆనందంలో శ్రీవల్లి స్టెప్పేశాడు. ఆ తర్వాత మరో బంగ్లాదేశ్‌ ఆటగాడు నజ్‌ముల్‌ కూడా ఇదే స్టెప్‌ వేసి అలరించాడు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా కేవలం తెలుగులో విడుదలై ఉంటే ఈ మాత్రం రెస్పాన్స్‌ వచ్చేదో లేదో తెలియదు. అయితే మొత్తంగా ఐదు భాషల్లో సినిమా విడుదలవ్వడంతో పాటలు, స్టెప్పులు బాగా వైరల్‌గా మారిపోయాయి. అందుకే అందరూ ఆ స్టెప్పులేస్తున్నారు.

త్వరలో మొదలయ్యే ఐపీఎల్‌లో ఈ స్టెప్పులు ఇంకా పెరిగే అవకాశం ఉంది అనిపిస్తోంది. క్రికెట్‌కు ఫన్‌ యాడ్‌ చేయాలంటే ఐపీఎల్‌నే. మామూలుగానే ఇందులో వికెట్‌ తీస్తే సంబరాలు భలేగా ఉంటాయి. ఇప్పుడు ఆ సందడికి పుష్ప డైలాగ్‌లు, మేనరిజమ్స్‌, స్టెప్పులు కలుస్తాయేమో చూడాలి. అదేజరిగితే అల్లు అర్జున్‌, మైత్రీ టీమ్‌ రిప్లైలో ఇవ్వడంలో బిజీ అయిపోతారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus