రిలీస్ డేట్ ఫిక్స్ చేసిన పుష్ప టీం!

  • January 28, 2021 / 11:05 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అనే ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ పూర్తి చేస్తారు. దాని తరువాత కేరళలో కొంత భాగం పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. అన్ని సినిమాలకు ముందుగానే రిలీజ్ డేట్ లు బ్లాక్ చేస్తున్నట్లుగా ఈ సినిమాకి కూడా రిలీజ్ డేట్ ని ముందుగానే ఫిక్స్ చేసింది చిత్రబృందం.

ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్ ని వదిలారు. ఈ ఏడాది ఆగస్టు 13న ‘పుష్ప’ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ విషయాన్ని బన్నీ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ ఏడాది అందరినీ థియేటర్లో కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని.. సుకుమార్, దేవిశ్రీప్రసాద్ లతో కలిసి మరోసారి మేజిక్ చేయబోతున్నట్లు బన్నీ ట్వీట్ చేశాడు. సుకుమార్ ఇంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి.. అనుకున్న సమయానికి సినిమాని రిలీజ్ చేయగలడా..? లేదా..? అనేది చూడాలి.

కానీ బన్నీ మాత్రం వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి కొరటాల శివ సినిమా మీదకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. మరి సుక్కు త్వరగా ‘పుష్ప’ని కంప్లీట్ చేస్తారేమో చూడాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus