Pushpa2: పుష్ప2 విషయంలో నిర్మాతల సంచలన నిర్ణయమిదే!

  • June 30, 2022 / 07:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న పుష్ప2 సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పుష్ప ది రైజ్ హిందీ హక్కులు తక్కువ మొత్తానికే విక్రయించడంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోయారు. పుష్ప ది రూల్ సులువుగా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ది రూల్ సినిమా విషయంలో గతంలో చేసిన తప్పు రిపీట్ కాకుండా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు.

హిందీలో పుష్ప ది రూల్ సినిమాను నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. బాలీవుడ్ లోని ప్రముఖ సంస్థల సహాయంతో కమిషన్ బేసిస్ లో హిందీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఫలితంగా హిందీ నుంచి ఏ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా ఆ మొత్తం నిర్మాతల సొంతం కానుంది. పుష్ప2 సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తగ్గేదేలే అనే డైలాగ్ తో బన్నీ బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకున్నారు.

బన్నీ పుష్ప ది రూల్ కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రష్మిక పాత్రకు పుష్ప ది రూల్ లో ప్రాధాన్యత మరింత పెరగనుందని తెలుస్తోంది. ఆగష్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

పుష్ప ది రూల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుకుమార్ పుష్ప2 సినిమాను పూర్తి చేసి రామ్ చరణ్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. సుకుమార్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు సుకుమార్ కు క్రేజ్ పెరుగుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus