R. Narayana Murthy: బన్నీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్.నారాయణమూర్తి.. పుష్ప పేరు చెబుతూ?

బన్నీ (Allu Arjun)  సుకుమార్ (Sukumar)  కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీకి క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. తగ్గేదేలే అనే డైలాగ్ తో అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారు. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ తేదీకి ఈ సినిమా కచ్చితంగా రిలీజయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉంది.

అయితే ఆర్.నారాయణమూర్తి ఒక సందర్భంలో బన్నీ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. (Sairam Shankar) సాయిరాం శంకర్ హీరోగా తెరకెక్కిన వెయి దరువెయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ వెయ్ దరువెయ్ మూవీ పుష్ప ది రైజ్ (Pushpa)  సినిమాలా హిట్ కావాలని కామెంట్లు చేశారు. ఈ మధ్య కాలంలో బన్నీ గారు ప్రపంచాన్ని తగ్గేదేలే అంటూ దడదడలాడించేశారని నారాయణమూర్తి వెల్లడించడం గమనార్హం.

మనమంతా కూడా అల్లు అర్జున్ ను తగ్గేదేలే అంటూ ఇమిటేట్ చేశామని (R. Narayana Murthy) నారాయణమూర్తి పేర్కొన్నారు. బన్నీ ఫ్యాన్స్ ఆర్.నారాయణమూర్తి కామెంట్లను నెట్టింట వైరల్ చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప ది రూల్ ((Pushpa2) సినిమా నుంచి త్వరలో మరిన్ని ఆసక్తికర అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ బిజినెస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

పుష్ప ది రూల్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోందని సమాచారం అందుతోంది. జూన్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తైతే అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. పుష్ప ది రూల్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉండబోతుందని సమాచారం అందుతోంది.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus