గోవాలో ఎంజాయ్ చేస్తున్న రాశీ ఖన్నా…వైరల్ అవుతున్న ఫోటోలు..!

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో వారానికో ఫోటో షూట్లో పాల్గొంటూ వచ్చింది రాశీ ఖన్నా. అందులో లంగా వోణిలో.. రాశీ పాల్గొన్న ఫోటో షూట్ హైలెట్ గా నిలిచింది. ‘రంగస్థలం’ లో రామలక్ష్మీ మాదిరి ఆ ఫోటో షూట్లో మెరిసింది రాశీ ఖన్నా. ఆ ఫోటోలకు ఆమె అభిమానులు కూడా లైకుల వర్షం కురిపించారు.అయితే అంత చక్కగా కనిపిస్తే.. ఉపయోగం లేదు అనుకుందో ఏమో.. ఆ తరువాత బిkiniలో దర్శనమిచ్చి అందరికీ షాక్ కు గురిచేసింది.

ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఆమె ఆ ఫోటో షూట్లో పాల్గొన్నట్టు అప్పుడు చెప్పుకొచ్చింది. దాంతో నెటిజన్లు కూడా ఆ ఫోటోల పై నెగిటివ్ కామెంట్లు చేసింది లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి బిkiniలో దర్శనమిచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేసింది రాశీ ఖన్నా. అవును ప్రస్తుతం గోవాలో తన స్నేహితురాలు జీన కొట్వాల్ తో ఎంజాయ్ చేస్తుంది రాశీ ఖన్నా. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలకు ‘లైఫ్ ఈజ్ గుడ్’ ‘గోవా’ అంటూ హ్యాష్ ట్యాగులను జతచేసింది.

స్విమ్మింగ్ పూల్ వద్ద జుట్టుని ఆరబెట్టుకుంటూ ఇలా అందాల ప్రదర్శన చేస్తుంది రాశీ. ఈ ఫోటోలకు ఆమె ఫాలోవర్లు ‘బ్యూటీ ఫుల్’ ‘అసమ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం రాశీ చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. 3 తమిళ్ సినిమాలు, ఒక మలయాళం సినిమా చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే గోపీచంద్- మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో హీరోయిన్ గా రాశీని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus