షాకింగ్ డెసిషన్ తీసుకున్న రాశీ ఖన్నా?

టాలీవుడ్ లో పెద్దగా హడావిడి చేయకుండా.. తన సినిమాలు ఏవో తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది రాశీ ఖన్నా. ‘మనం’ చిత్రంతో ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ‘ఊహలు గుస గుస లాడే’ చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. మొదట్లో గ్లామర్ రోల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన రాశీ ఖన్నా.. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ చిత్రంలో తన నటనతో విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ తో తప్ప మరే స్టార్ హీరోతోనూ రాశీ ఖన్నా నటించకపోయినప్పటికీ.. టైర్ 2 హీరోల చిత్రాలతోనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంటుంది.

ప్రస్తుతం ‘వెంకీమామ’ ‘ప్రతీరోజు పండగే’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తూనే .. కోలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు.. అంటే ముంబైకు.. రాశీ మకాం మార్చబోతుందనేది తాజా సమాచారం. ఇప్పటికే గచ్ఛ బౌలి లో రాశీకి ఉన్న ఇంటిని.. అద్దెకు కూడా ఇచ్చేసిందట. దీనిని బట్టి చూస్తుంటే టాలీవుడ్ కు రాశీ గుడ్ బై చెప్పేస్తుందా అనే డౌట్ కూడా రాకమానదు. అయితే అక్కడ కూడా ప్రయత్నాలు మొదలుపెడుతూనే.. సౌత్ సినిమాలను కూడా చెయ్యాలని రాశీ డిసైడ్ అయ్యినట్టు తాజా సమాచారం.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus