H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌లో ఓ సినిమా కోసం పని చేస్తుండగా.. విజయ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ వచ్చింది దాంతో ఇటు వచ్చేశాను.. దర్శకుడు హెచ్‌.వినోద్‌ ఈ స్టేట్‌మెంట్‌ ఇవ్వగానే.. అందరూ కమల్‌తో సినిమా వదులుకున్నారా? అంత పెద్ద ప్రాజెక్ట్‌ ఎందుకు వదులుకున్నారు అనే ప్రశ్నలు వేస్తున్నారు. ఇద్దరు హీరోల మధ్య సాగే కథ అని కూడా చెప్పడంతో ఆ ప్రశ్నలు మరింత వాడిగా మారిపోయాయి. కొందరైతే కమల్‌ హాసన్‌ – రజనీకాంత్ సినిమాను వదులుకున్నారా అనే ప్రశ్నలు వేస్తున్నారు?

H Vinoth

మరి, నిజంగానే హెచ్‌. వినోద్‌ అంత పెద్ద సినిమాను వదులుకున్నారా? కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే వచ్చే ఆ ఛాన్స్‌ను ఆయన ఎందుకు వదలుకున్నారు అని చూస్తే.. ఓ ఆన్సర్‌ కనిపించింది. దాంతో అసలు విషయం ఇదీ అని అర్థమవుతోంది. ఆ ఇంటర్వ్యూలో హెచ్‌.వినోద్‌ ఏం చెప్పారా అని చూస్తే.. అజిత్‌ ‘తునివు’ సినిమా తర్వాత కమల్‌ హాసన్‌ బ్యానర్‌లో సినిమా అయింది. ఓ హై ఆక్టేన్‌ యాక్షన్‌ సినిమా ఇది. ఇద్దరు హీరోల మధ్య సాగే కథ. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది.

దీంతో, చేతిలో అప్పటికి ఏ సినిమా లేని వినోద్‌కి.. విజయ్‌ కొత్త సినిమా కోసం కథలు వింటున్నారని తెలిసిందట. వెంటనే తన దగ్గరున్న మరో కథ చెప్పారట. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు, మార్పుల వల్ల మారి మారి ‘జన నాయగన్‌’గా మారింది అని చెప్పారు హెచ్‌.వినోద్‌. అలాగే ఆ సినిమా కమల్‌ – రజనీ సినిమా కాదు. KH233 అనే వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్‌ అయిన సినిమాలో కమల్ – విజయ్‌ సేతుపతి నటించాలి అనుకున్నారు. కానీ వీలుపడలేదు.

ఇక కమల్‌ – రజనీకాంత్‌ సినిమా విషయానికొస్తే.. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత కొన్నాళ్లకు ఈ కాంబో రూమర్స్‌ వచ్చి, ఓకే అయింది. ఆ సినిమాను నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరక్ట్ చేయబోతున్నారు. ఇటీవల అనౌన్స్‌మెంట్‌ వీడియో కూడా వచ్చింది.

బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus