Prabhas, Pooja Hegde: పూజాహెగ్డే బిహేవియర్ పై ‘రాధేశ్యామ్’ మేకర్స్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ ప్రభాస్-పూజాహెగ్డే మధ్య విభేదాలు వచ్చాయనే సంగతి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలిసి ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సెట్ లో పూజా తీరు ఏమాత్రం బాగాలేదని.. టాప్ హీరోయిన్ అనే ఈగోతో ప్రతిరోజు షూటింగ్ కు ఆలస్యంగా వస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. పూజా తీరుతో ఎంతో బిజీగా ఉండే ప్రభాస్ సైతంవిసిగిపోయారని.. దీంతో ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సైతం విడివిడిగా షూట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ రూమర్స్ పై ‘రాధేశ్యామ్’ టీమ్ స్పందించింది. ప్రభాస్ కు, పూజాహెగ్డేకు మధ్య విభేదాలు అనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా పూజా మంది టైమ్ సెన్స్ పాటిస్తుందని.. ఆమెతో కలిసి పని చేయడం కంఫర్ట్ గా ఉందని.. ఆమె బిహేవియర్ పై వస్తోన్న రూమర్లను కొట్టిపారేశారు. తెరపై వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండిందని.. ఆ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

1970లో యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా.. పూజాహెగ్డే డాక్టర్ ప్రేరణగా నటించనుంది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus