పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ మార్చి 11న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్యాడ్ పెర్ఫార్మన్స్ ను కొనసాగిస్తూనే ఉంది. సాధారణంగా సెకండ్ వీకెండ్ కు స్టార్ హీరో సినిమా ఉంటే.. అది కూడా పోటీగా పెద్ద సినిమాలు లేకపోతే భారీ కలెక్షన్లు నమోదవుతాయి.కానీ ‘రాధే శ్యామ్’ విషయంలో అది జరగలేదు.మొదటిరోజు ఈ చిత్రానికి మౌత్ టాక్ బ్యాడ్ గా ఉండడంతో కలెక్షన్లు పడిపోయాయి.
రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది. వీకెండ్ వరకు బాగానే కలెక్ట్ చేసిన ఈ చిత్రం తర్వాత చేతులెత్తేసింది.
ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
24.29 cr
సీడెడ్
07.39 cr
ఉత్తరాంధ్ర
05.04 cr
ఈస్ట్
04.32 cr
వెస్ట్
03.31 cr
గుంటూరు
04.44 cr
కృష్ణా
02.64 cr
నెల్లూరు
02.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
53.56 cr
తమిళ్ నాడు
0.85 cr
కేరళ
0.43 cr
కర్ణాటక
04.29 cr
నార్త్ ఇండియా (హిందీ)
10.27 cr
ఓవర్సీస్
11.34 cr
రెస్ట్
04.20 cr
టోటల్ వరల్డ్ వైడ్
84.94 cr
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.84.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.115.06 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక అద్భుతాలు జరిగినా ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమని తేలిపోయింది.! ఈ వారం ‘ఆర్.ఆర్.ఆర్’ ఎంట్రీ ఉంది కాబట్టి.. ‘రాధే శ్యామ్’ రన్ ఎండ్ అయిపోయినట్టే..!