సౌత్ సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ఈ బ్యూటీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. బాలయ్యకు జోడీగా లెజెండ్, లయన్ సినిమాలలో రాధికా ఆప్టే నటించారు. ఈ సినిమాలతో పాటు రక్తచరిత్ర1, రక్తచరిత్ర2 సినిమాలు సైతం రాధికా ఆప్టేకు తెలుగులో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే గతంలో సౌత్ హీరోల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాధికా ఆప్టే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీపై విషం కక్కారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఈ బ్యూటీ పేర్కొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లను దారుణంగా ట్రీట్ చేస్తారంటూ ఆమె కామెంట్లు చేశారు. హీరోయిన్ అంటే ఈ ఇండస్ట్రీలో సెట్ లో మూడో వ్యక్తి అని ఆమె చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో మేల్ హీరోల డామినేషన్ ఎక్కువని రాధికా ఆప్టే తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్స్ విషయంలో క్లారిటీ ఉండదని ఇష్టానుసారం షూటింగ్ లను రద్దు చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.
ఇతర యాక్టర్లకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా షూటింగ్ లను రద్దు చేయడం జరుగుతుందని రాధికా ఆప్టే అన్నారు. ఈ విధమైన ఇబ్బందులు నాకు చాలాసార్లు ఎదురయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ ఇండస్ట్రీలో నా అవసరం అంతేనని గ్రహించానని ఆమె తెలిపారు. రాధికా ఆప్టే చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా టాలీవుడ్ సినీ అభిమానులు మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు.
టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తుండటంతో రాధికా ఆప్టే ఈ విధంగా విషం కక్కుతున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. రాధికా ఆప్టేకు తెలుగులో ఇకపై ఆఫర్లు వచ్చే అవకాశం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాధికా ఆప్టే (Radhika Apte) సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!
‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!