Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Actress: హీరోల కంటే హీరోయిన్లు తక్కువవేమి కాదు!

Actress: హీరోల కంటే హీరోయిన్లు తక్కువవేమి కాదు!

  • May 2, 2023 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: హీరోల కంటే హీరోయిన్లు తక్కువవేమి కాదు!

రాధికా ఆప్టే…తెరపై బోల్డ్‌ పాత్రల్లో నటించడానికి ఏమాత్రం మొహమాటపడదు. బయట కూడా తనకు ఏం అనిపిస్తే అది మాట్లాడుతుంది. ఆ గుణమే.. రాధికకు అభిమానుల్ని సంపాదించిపెట్టింది. తన నటనతో అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకొన్న రాధిక ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లతో బిజీగా గడుపుతోంది. ఆమె ఆలోచనలు, తన కెరీర్‌లో ఎదిగిన తీరుపై ఓ లుక్కేస్తే…! రాధిక పుట్టింది తమిళనాడులోని వెల్లూరులో. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. పుణేలో డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచీ నాట్యం అంటే ఇష్టం. గురువు రోహిణీ భాటె దగ్గర నాలుగేళ్లు సాధన చేసి కథక్‌ నేర్చుకొంది.

అయితే తన నాట్య ప్రావీణ్యాన్ని వెండితెరపై ప్రదర్శించే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. నాటకరంగంతో రాధికకు అనుబంధం ఉంది. ఆ ప్రయాణంలోనే సినిమా వాళ్లతో పరిచయాలయ్యాయి. మరాఠీలో నాటకాలు ప్రదర్శించే మోహిత్‌ టక్లర్‌ థియేటర్స్‌తో జట్టు కట్టింది. ఆ సంస్థ ప్రదర్శించే నాటకాల్లో కీలక భూమిక పోషించింది. బాలీవుడ్‌లో రాధికా ఆప్టే చుట్టూ గాసిప్పులు మూగాయి. ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’ సినిమాలో నటిస్తున్నప్పుడు సహనటుడు తుషార్‌కపూర్‌తో ప్రేమలో పడిందని, ఇద్దరూ సహజీవనం చేశారని వార్తలొచ్చాయి. ఆ తరవాత తాను నటించే ప్రతీ సినిమాలోనూ హీరోలతో లింకులు పెడుతూ గాసిప్పులు అల్లారు.

Radhika Apte,Radhika Apte Images,Radhika Apte Photoshoot

వాటిని ధైర్యంగానే ఎదుర్కొంది రాధిక. ‘‘ప్రేమలో పడడం చాలా సహజమైన విషయం. దాచి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. మీడియా ఏం రాస్తే అది నిజమని నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు’’ అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది రాధిక. 2012లో బెనెడెక్ట్‌ టేలర్‌ అనే ఓ బ్రిటీష్‌ మ్యుజీషియన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘అంధాదూన్‌’ రాధికకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లో రాధిక బోల్డ్‌గా నటించిన విధానం విమర్శకుల మన్ననలు పొందింది. అనురాగ్‌ కశ్యప్‌ రూపొందించిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో కూడా రాధిక నగ్నంగా కనిపించింది. ఆ వీడియోలు అప్పట్లో బాగా వైరల్‌ అయ్యాయి.

తెలుగులో ‘లెజెండ్‌’, ‘లయన్‌’, ‘ధోనీ’లాంటి చిత్రాల్లో మెరిసింది రాధిక. అయితే… కమర్షియల్‌ హీరోయిన్‌గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. ‘‘కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌ అనే తేడాలు నటిగా నాకు లేవు. నాకు సంతృప్తి ఏ పాత్రలో దొరికితే అదే నాకు కమర్షియల్‌.’’ అంటోంది రాధిక. స్నేహితులతో కలిసి విరివిగా షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసింది. ఈ క్రమంలోనే సినిమాలకు అత్యంత కీలకమైన కెమెరా, ఎడిటింగ్‌ విభాగాల్లో తనకు పట్టు దొరికింది. తన షార్ట్‌ ఫిల్మ్స్‌ ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్ని దక్కించుకొన్నాయి. దాంతో చిత్రసీమ నుంచి ఆహ్వానాలు రావడం మొదలైంది.

డైటింగ్‌ అనే విషయానికి (Actress) రాధిక పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. నటన అనేది శరీరంతో ఆకర్షించే వస్తువు కాదన్నది.. రాధిక ఫిలాసఫీ. ‘‘కొంతమంది కళ్లతోనూ నటిస్తారు. దానికి శరీరంతో పనేముంది? మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కేవలం వెండితెరపై గ్లామర్‌గా కనిపించాలన్న తపనతో… తిండికి, తమ ఇష్టాలకు దూరంగా ఉన్న కథానాయికల్ని చూస్తే జాలేస్తుంది’’ అని చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. ‘పర్చడ్‌’ అనే ఓ హిందీ చిత్రంలో నగ్నంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విడుదలకు ముందే రాధికా ఆప్టే నగ్న దృశ్యాలు లీకై సంచలనం సృష్టించాయి.

ఆ సినిమా పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే ఈ న్యూడ్‌ సీన్స్‌ని బయటకు వదిలారని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. ఆ సినిమా విడుదలై.. ఫ్లాప్‌ అయ్యింది. కానీ అంతర్జాతీయంగా రాధిక పేరు మార్మోగింది. హీరోలపై రాధికకు కాస్త కోపం ఎక్కువే. ‘‘హీరోలు, హీరోయిన్లు అనే తేడా చిత్రసీమలో ఎక్కువగా కనిపిస్తుంది. ఓ సినిమా కోసం మా కంటే హీరోలు కాస్త ఎక్కువ కష్టపడతారేమో? కానీ అందుకొనే పారితోషికం అందుకు వంద రెట్లు ఎక్కువ ఉంటుంది. కథానాయికలు కూడా ఎందులోనూ తీసిపోరు. ఆత్మాభిమానం కోసం పోరాడే ప్రతీ అమ్మాయి నా దృష్టిలో హీరో కంటే ఎక్కువ’’ అంటోంది రాధిక.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Radhika Apte
  • #Actress Radhika Apte
  • #Radhika
  • #Radhika Apte

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version