కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి అనౌన్స్ చేసిన దగ్గరినుండి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.. వివాహం జరిగిన కొద్ది రోజులకే సరోగసి పద్ధతిలో పిల్లల్ని కనడం పెద్ద దుమారమే రేపింది.. విషయం కోర్టు వరకు వెళ్లడం.. నయన్, విఘ్నేష్ సరైన ఆధారాలు చూపించడంతో ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది.. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు నయన్ ఇంటికెళ్లి.. భార్య భర్తలను పలుకరిస్తున్నారు..
పుట్టిన ఇద్దరు కవలలను చూసి ఆశీర్వదిస్తున్నారు.. రీసెంట్‌గా సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కూడా నయన్ ఇంటికెళ్లారు.. పిల్లల్ని చూసి, వాళ్లతో కాసేపు సరదాగా గడిపారామె. బేబీస్ ఇద్దరూ భలే క్యూట్‌గా ఉన్నారంటూ.. నయన్, విఘ్నేష్‌లతో కలిసి ఉన్న పిక్ షేర్ చేశారు రాధిక. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ థర్డ్ ఎపిసోడ్‌లో సందడి చెయ్యబోతున్నారామె.
నయన్, విఘ్నేష్ దంపతులు ఇటీవల దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పిల్లలిద్దర్నీ ప్రేక్షకాభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.. కొద్దికాలం పాటు నయనతార పిల్లల బాధ్యతల్ని చూసుకుంటుందని.. ఓ స్టార్ హీరోతో విఘ్నేష్ శివన్ చేయబోయే సినిమా ప్రకటన త్వరలో రానుందని కోలీవుడ్ మీడియా సమాచారం..
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!