సీక్రెట్ గా ‘బిగ్ బాస్’ విన్నర్ పెళ్ళి.. నిజమేనా?

  • May 22, 2020 / 03:25 PM IST

తన మ్యూజిక్ ఆల్బమ్స్ తో యూత్ లో ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్… తరువాత ఎన్నో సినిమాల్లో సాంగ్స్ పాడాడు… అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే ‘బిగ్ బాస్3’ లోకి ఎంటర్ అయ్యాక అతని క్రేజ్ మరింతగా పెరిగింది. మరో కంటెస్టెంట్ పునర్నవితో ఇతని రొమాన్స్.. యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక శ్రీముఖి ఇతన్ని అనుక్షణం టార్గెట్ చేస్తూ ఉండడం.. ఇతని పై సింపతీ ఏర్పడేలా చెయ్యడంతో పాటు ‘బిగ్ బాస్3’ విన్నర్ అవ్వడానికి కూడా కారణమయ్యాయి అనే చెప్పాలి.

ఇక హౌస్ నుండీ బయటకు వచ్చాక రాహుల్, పునర్నవి డేటింగ్ లో ఉన్నారని.. వాళ్ళు పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను వీరిద్దరూ ఖండించారు కూడా..! ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్నాడు అంటూ ఇప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే అమ్మాయి మాత్రం పునర్నవి కాదు అని తెలుస్తుంది. లాక్ టైములో చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

ఆ లిస్ట్ లో రాహుల్ కూడా చేరాడని టాక్ వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల రాహుల్ ఓ ఫోటోని పోస్ట్ చేసాడు. వరుణ్ సందేశ్, వితిక లతో పాటు సింగర్ నోయల్ కూడా ఈ ఫొటోలో ఉన్నాడు. అయితే నోయల్ ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ కామెంట్ చేసి అతన్ని ట్యాగ్ చేసాడు. అంతే ఇక ఈ వార్త వైరల్ గా మారింది. మరి అసలు మ్యాటర్ ఏంటన్నది రాహులే చెప్పాల్సి ఉంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus