శిల్పా ఎప్పటికీ నా యువరాణి అని ఆమె భర్త రాజ్ కుంద్రా చెప్పారు. ఆమె నుంచి నేను విడిపోవడం లేదు అని స్పష్టం చేశారు. సాహసవీరుడు సాగరకన్య ద్వారా తెలుగు తెరకి పరిచయమైనా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పొడుగు కాళ్ళ సుందరిగా పేరు తెచ్చుకుంది.
వీడెవడండీ బాబూ సినిమాలోను నవ్వించింది. సినిమాలో కలిసి రాక పోవడంతో బిగ్ బ్రదర్ రియాల్టీ షో లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆ సమయంలోనే వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయ్యింది. వీరికి ఒక బాబు కూడా కలిగాడు. సంతోషంగా వీరి కాపురానికి బీటలు వారాయని వార్తలు గుప్పుమన్నాయి. నెల రోజులుగా రాజ్ కుంద్రా ఇంటికి కూడా రావడంలేదని, త్వరలోనే ఈ జంట విడిపోనుందని ప్రచారం మొదలయింది.
ఈ వార్తలు రాజ్ కుంద్రాకు చేరడంతో షాక్ తిన్నారు. వెంటనే మీడియా ముందుకు తాము విడిపోతున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసారు. “నేను గత కొన్ని రోజులుగా ఇంటికి వెళ్ళడం లేదు. అది నిజమే. అంత మాత్రాన నాకు శిల్ప మీద ప్రేమ తగ్గిపోయిందని ఎలా అనుకుంటారు. నేను వర్క్ బిజీలో ఉండి ఆమెతో గడపలేక పోయాను. దీంతో ఆమె కొంత అసహనంగా ఉంది. తప్పు నాదే. ఈ వారంలో(జూన్ 8) ఆమె పుట్టిన రోజు ఉంది. మంచి గిఫ్ట్ ఇచ్చి కోపాన్ని పోగొడతాను” అని చెప్పుకొచ్చాడు.