తొలిసారి వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్.. టైటిల్ తోనే అంచనాలు పెంచేస్తూ..!

యంగ్ జనరేషన్ టాలీవుడ్ హీరోలలో ఒకరైన రాజ్ తరుణ్ నటించిన అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీలలో ఒకటైన జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ టీజర్, ట్రైలర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ కు జోడీగా శివాని రాజశేఖర్ ఈ వెబ్ సిరీస్ లో నటించగా ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

అహ నా పెళ్లంటతో రాజ్ తరుణ్ ఖాతాలో కచ్చితంగా సక్సెస్ చేరే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నరేష్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. తమడా మీడియా, జీ5 సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉండనుందని ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోల ద్వారా అర్థమవుతోంది.

ఈ వెబ్ సిరీస్ టైటిల్ సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ శీను పాత్రలో కనిపించనుండగా శివాని రాజశేఖర్ మహా పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

విజయవాడలో రాజ్ తరుణ్, అహ నా పెళ్లంట టీమ్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ తో రాజ్ తరుణ్ కెరీర్ గ్రాఫ్ మరింత పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తొలిసారి రాజ్ తరుణ్ వెబ్ సిరీస్ లో నటించడం గమనార్హం. టైటిల్ తోనే అంచనాలు పెంచేసిన రాజ్ తరుణ్ కు ఈ వెబ్ సిరీస్ తో సక్సెస్ దక్కినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus