Raj Tarun: సరదా వీడియో రిలీజ్‌ చేసిన రాజ్‌తరుణ్‌.. ఏ సినిమానో!

సినిమాల ప్రచారంలో సోషల్‌ మీడియాలో బాగా వాడటం రావాలి. ఈ మాట మేం చెప్పడం లేదు. గత కొద్ది రోజులగా సినిమా సెలబ్రిటీల ప్రమోషన్స్‌ స్టైల్‌ను చూసి చెబుతున్న మాట ఇది. ఇప్పటివరకు సినిమా పోస్టర్‌లు, వీడియోలను మాత్రమే షేర్‌ చేసి ప్రమోషన్స్‌ చేసి సినిమా జనాలు.. ఇప్పుడు వాటికి కాస్త కాంట్రవర్శీలు యాడ్‌ చేసి.. ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్‌ చేయాలని చూస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ లేటెస్ట్‌గా రాజ్‌తరుణ్‌ రిలీజ్‌ చేసిన వీడియో. ఆదివారం ఉదయం నెటిజన్లు ఖాళీగా ఉంటారనో, లేక ఆయనకు టైమ్‌ ఉందనో కానీ.. రాజ్‌తరుణ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

అందులో పెళ్లి అంటే తనకు చిన్నతనం నుండి ఇంట్రెస్ట్‌ లేదని, కానీ ఇంట్లోవాళ్లంతా ఓ పెళ్లి సంబంధం చూసి ఓకే అనిపించారని చెప్పారు. తీరా పెళ్లి మండపం వరకు వెళ్లాక పెళ్లి కూతురు కనిపించడకుండా పోయింది అంటూ.. తనదైన సెటైరికల్‌ యాసతో చెప్పుకొచ్చాడు రాజ్‌తరుణ్‌. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రాజ్‌తరుణ్‌ రిలీజ్‌ చేసిన వీడియో చూసి.. ఇదేదో పర్సనల్‌ వీడియో అని జనాలు అనుకునే అవకాశం ఎలాగూ లేదు. సినిమా ప్రమోషన్‌ లేదంటే, వెబ్‌సిరీస్‌ ప్రచారం అని తేల్చేశారు ఈజీగా.

కాస్త పట్టి చూస్తే.. ఈ వీడియో తన రాబోయే వెబ్‌ సిరీస్‌ ‘అహ నా పెళ్లంట’కి సంబంధించి అని ఈజీగానే చెప్పేయొచ్చు. కొంతమంది నెటిజన్లు కూడా దీనికి సంబంధించి కామెంట్స్‌ పెడుతున్నారు. అన్నట్లు ఈ వీడియోలో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ హీరోయిన్‌ ఫొటో రేపు చూపిస్తా అని కూడా చెప్పారు. కాబట్టి రేపు ఇంకో వీడియో ఉంటుంది. ఇక ఆ వీడియోలో రాజ్‌తరుణ్‌ ఏం చెప్పాడంటే.. ‘‘ఓ అమ్మాయి గురించి మీ అందరికీ చెప్పాలి. నా జీవితంలో అమ్మాయి గురించి మాట్లాడే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితానికి ప్రేమ సెట్‌ కాదని ఎప్పుడో అర్థమైపోయింది.

నాకు పెళ్లి చేయమని అమ్మానాన్నను అడిగా. దాంతో మంచి సంబంధం చూశారు. ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. తీరా చూస్తే అమ్మాయి ముహూర్తం సమయానికి జంప్‌. చుట్టాలందరూ సానుభూతి మొదలుపెట్టారు’’ అని చెప్పాడు రాజ్‌తరుణ్‌. అక్కడితో ఆగకుండా.. ‘ఒసేయ్‌.. నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా? నీ అంతు చూస్తా? రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా. ఆమె కనపడితే దయచేసి నాకు చెప్పిండి’ అంటూ రాజ్‌తరుణ్‌ ఈ వీడియోలో వివరించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus