Raj Tarun: ‘స్టాండప్‌ రాహుల్‌’ వెనుక కథ చెప్పిన రాజ్‌ తరుణ్‌!

  • March 17, 2022 / 07:47 AM IST

ఈ సినిమాకు కథ రాసుకుంటున్నప్పుడు మనసులో మా హీరోనే ఉన్నాడు అంటుంటారు దర్శకులు. కొత్త తరం దర్శకుల నుండి, స్టార్‌ దర్శకుల వరకు చాలామంది ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమా కాదా అనేది ఆ దేవుడికే ఎరుక. అయితే సినిమా కథ అంతా రెడీ అయ్యి… హీరో ఎవరైతే బాగుంటారు అనుకొని… దాని కోసం ఓ పెద్ద లిస్ట్‌ రాసి… అందులో ఆఖరి పేరు రాసిన హీరోతో సినిమా చేస్తే.. కాస్త కన్‌ఫ్యూజ్‌గా ఉన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.

Click Here To Watch Now

ఇదంతా జరిగింది శుక్రవారం రిలీజ్‌ కాబోతున్న ‘స్టాండప్‌ రాహుల్‌’ సినిమా గురించే. అవునుద ఈ సినిమా దర్శకుడు సాంటో ఈ విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు. తన కథకు ఎవరు హీరోలుగా బాగుంటారని నిర్మాతలు అడిగితే… సాంటో పది పేర్లతో లిస్ట్‌ ఇచ్చారట. నిజానికి ఈ లిస్ట్‌ రాస్తున్నప్పుడు ఆయనకు తొమ్మిది పేర్లే మనసులో తట్టాయట. ఆఖరికి పదో పేరు కూడా ఇవ్వాలి అని అనిపించినప్పుడు… గూగుల్‌లో టాలీవుడ్‌ యంగ్‌ హీరోస్‌ అని సెర్చ్‌ చేస్తే రాజ్‌తరుణ్‌ పేరు వచ్చిందట.

అలా రాజ్‌తరుణ్ పేరును లిస్ట్‌లో 10వ పేరుగా యాడ్‌ చేసి.. నిర్మాతకు ఇచ్చారట. ఈ సినిమా నిర్మాతల అందరితో మాట్లాడి… ఆఖరికి రాజ్‌తరుణ్‌ దగ్గర వచ్చి ఆగారట. ఆయన సినిమాకు అంగీకరించడంతో సినిమా పట్టాలెక్కిందట. ఇప్పుడు పూర్తై విడుదలకు సిద్ధమైంది. అలా సినిమా కోసం అసలు ఛాయిస్‌గానే లేకపోయినా రాజ్‌తరుణ్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు అని దర్శకుడు సాంటో చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమా కోసం రాజ్‌తరుణ్‌ లుక్‌ విషయంలో కూడా సాంటో చాలా పక్కాగా ఉన్నారట.

నా హీరో ఇలానే ఉండాలి అని మేకోవర్‌ చేయించారట రాజ్‌తరుణ్‌తో. అసలు ఇప్పటివరకు రాజ్‌తరుణ్‌ ఇలాంటి లుక్‌లో ఏ సినిమాలోనూ కనిపించలేదు. పొడవాటి జుట్టుతో… పక్కా విలేజ్‌ బాయ్‌, అల్లరి కుర్రాడిలా ఉండేవాడు. ఈసారి కురచ జుట్టుతో కొత్తగా ఉన్నాడు. ఇదంతా సాంటో పని అన్నమాట.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus