ఒకసారి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో మళ్ళీ పనిచేయాలంటే అగ్ర కథానాయకులు సైతం ఆలోచిస్తుంటారు. అందులోనూ తమ కెరీర్ డేంజర్ లో ఉన్నప్పుడు కనీసం ఆ ఆలోచన కూడా తమకు రానివ్వరు. అలాంటిది తన కెరీర్ కే ఇంకా సరైన దిక్కులేని తరుణంలో.. తన హీరోగా నటించిన “సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు” సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమై.. కోలుకోలేని ఫ్లాప్ ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డికి మరో అవకాశం ఇచ్చాడు రాజ్ తరుణ్.
కొన్నాళ్ళ విరామం అనంతరం వరుస సినిమాలు సైన్ చేస్తున్న రాజ్ తరుణ్.. శ్రీనివాస్ గవిరెడ్డికి రెండో అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. ఇకపోతే.. రాజ్ తరుణ్ నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకానున్నాయి. ఈ సినిమా కూడా ఆ తేదీకి పూర్తయితే.. మొత్తం మూడు సినిమాలను ఒకే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఈ వరుస సినిమాలతో రాజ్ తరుణ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!