రాజ్ తరుణ్ సినిమా ఇక ఓటిటి కేనా?

‘బుజ్జిగాడు’ టీం అనగానే మన ప్రభాస్ సినిమా ‘బుజ్జిగాడు’ టీం అనుకోకండి.. ! రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘ఒరేయ్ బుజ్జిగాడు’ టీం అనమాట..! ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్ హిట్ అందించిన కొండా విజయ్ కుమార్ ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రానికి దర్శకుడు. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లు..! ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసారు కానీ.. వైరస్ మహమ్మారి దెబ్బకు అది ఆగిపోయింది.

అందుకే ‘నేరుగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నారు’ అని మొన్నటివరకూ ప్రచారం నడిచింది. అయితే అదంతా ఫేక్ న్యూస్ అని నిర్మాతలు తేల్చి పడేసారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోవు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. దాంతో ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని నేరుగా ఓటిటిలోకే విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యనే ఓటిటిలో విడుదలైన ‘పెంగ్విన్’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాలకు మంచి స్పందన లభించింది.

ఆ చిత్రాల నిర్మాతలు అప్పుడే గట్టెక్కేసినట్టు కూడా సమాచారం. ఎక్కువ మంది ఆ చిత్రాన్ని వీక్షిస్తే ఆ సమయాన్ని బట్టి మరింతగా ఓటిటి సంస్థలు చెల్లిస్తున్నాయి. కాబట్టి వీటి వల్ల నిర్మాతలకు లాభమే కానీ నష్టం లేదనే టాక్ నడుస్తుంది. ఇక రాజ్ తరుణ్ మార్కెట్ కూడా ఈ మధ్యకాలంలో బాగా డౌన్ అయ్యింది’ ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ వంటి చిత్రాలకు సరైన బిజినెస్ కూడా జరగలేదు. కాబట్టి మంచి రేటు వస్తే ‘ఒరేయ్ బుజ్జిగా’ ను ఓటిటిలో వదిలెయ్యడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల నుండీ సమాచారం.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus