Prabhas: ప్రభాస్ – మారుతి సినిమా.. ఫైనల్ గా ఆ టైటిల్ కే ఓటేశారట..!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో మారుతి దర్శకత్వంలో చేస్తున్న మూవీ కూడా ఒకటి. ‘ఆదిపురుష్’ ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ వంటి సినిమాలతో పాటే మారుతి సినిమా షూటింగ్ పార్ట్ ను కూడా కంప్లీట్ చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతుంది. కానీ అధికారికంగా ఈ చిత్రానికి అనౌన్స్మెంట్ ఇచ్చింది లేదు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక ఈ చిత్రంలో సత్యరాజ్, సంజయ్ దత్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్ ఒకటి మొన్నామధ్య ఇంటర్నెట్ లో లీక్ అయ్యి హల్ చల్ చేసింది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేశారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్టు గురించి న్యూస్ బయటకు వచ్చినప్పుడే.. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది.

కానీ అందులో నిజం లేదని..! ఈ చిత్రానికి వేరే టైటిల్ అనుకుంటున్నట్టు మేకర్స్ చెప్పారు. దీంతో రాజా డీలక్స్ అనే టైటిల్ ను పక్కన పెట్టినట్లు అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు మళ్ళీ టాక్ నడుస్తుంది. మారుతి నాలుగైదు టైటిల్స్ అనుకున్నా, అవి టీంకి నచ్చకపోవడంతో.. ‘రాజా డీలక్స్’ కే మక్కువ చూపిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అప్పుడు టైటిల్ తో సహా ఓ పోస్టర్ ను వదిలే అవకాశాలు ఉన్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus