ఖరారైన రవితేజ ‘రాజా ది గ్రేట్’ మూవీ టీజర్ రిలీజ్ డేట్!
- July 31, 2017 / 07:13 AM ISTByFilmy Focus
రవి తేజ్ అంటే .. మాస్ మహా రాజ్. అతని సినిమాలో ఫస్ట్ రీల్ నుంచి ఫోర్టీన్త్ రీల్ వరకు సందడే సందడి. తన ఎనర్జీతో అందరిలో ఉత్సాహం నింపుతారు. మరి అలాంటి అతను తొలిసారి అంధుడిగా నటిస్తున్నారు. అయినా రాజా నువ్వు గ్రేట్ అనిపించుకోనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ చేస్తున్న సినిమా ‘రాజా ది గ్రేట్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
అక్టోబర్ లో థియేటర్లోకి రానున్న రాజా.. యూట్యూబ్ లో హంగామా సృష్టించడానికి సిద్ధమయి పోయాడు. అదేనండీ ఈ మూవీ టీజర్ ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ‘అదుర్స్’ రఘు తదితరులతో రవితేజ చేసే కామెడీ సినిమాకి హైలెట్ కానుందని సమాచారం. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















