Crazy Uncles Movie: ‘క్రేజీ అంకుల్స్’ గురించి నటుడు రాజా రవీంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

  • August 18, 2021 / 08:03 PM IST

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘క్రేజీ అంకుల్స్’. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. ‘గుడ్ సినిమా గ్రూప్స్’, ‘గ్రీన్ మెట్రో మూవీస్’, ‘శ్రీవాస్ 2 క్రియేటివ్స్’ బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆగస్ట్ 19న(రేపు) విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

దాంతో సినిమా పై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయని చెప్పాలి.ఇక ఈ చిత్రంలో రాజుగారు అనే ముఖ్య పాత్ర‌ని పోషించిన సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని ఆసక్తి కరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నా పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. 50 ఏళ్లు దాటాక ఓ వ్య‌క్తి కి భార్య‌తో ఎక్కువ అనుబంధం ఉంటుంది. కానీ ఆమె మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు వ‌చ్చిన త‌ర్వాత భర్తని స‌రిగ్గా ప‌ట్టించుకోక‌పోతే..

అతను ఫేస్‌బుక్ స‌హా ఇత‌ర సోష‌ల్ మీడియాల్లో ఎవ‌రో ఒక అమ్మాయితో చాటింగ్ చేయ‌డం మొదలు పెడతాడు.అలా చేయడం వల్ల అతనికి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి’ అనే థీమ్ తో నా పాత్ర ఉంటుంది. అదే విధంగా మ‌నో, భ‌ర‌ణి పాత్ర‌లు కూడా ఉంటాయి.ఈ సినిమా యూత్ కు ఫ్యామిలీస్ కు కూడా కనెక్ట్ అవుతుంది. కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అందుకే ఓటిటి ఆఫర్లు వచ్చినా చాలా కాన్ఫిడెంట్ గా థియేటర్లలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇది ఓటిటిలో చూసే సినిమా కాదు థియేటర్లలో చూడాల్సిన సినిమా’ అంటూ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus