The Raja Saab: బూతులతో ఫ్యాన్ వార్నింగ్.. మారుతి రిప్లై చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

ప్రభాస్ సినిమా అప్డేట్ అంటేనే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ ఉంటుంది. అందులోనూ చాలా కాలం తర్వాత డార్లింగ్ నుంచి ఒక మాస్ డ్యాన్స్ నెంబర్ రావడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. తమన్ స్వరపరిచిన ‘నాచ్చే నాచ్చే’ సాంగ్ బీట్, ప్రభాస్ స్టైలిష్ లుక్ చూసి అంతా పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సంబరాల్లో కూడా ఒక అభిమానికి మాత్రం చిన్న అనుమానం వచ్చింది. ఆ డౌట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, ఏకంగా దర్శకుడి దృష్టికే వెళ్ళింది.

The Raja Saab

సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాల్లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ నడుస్తోంది. మంచి జోష్ ఉన్న మాస్ పాటలను లేదా స్పెషల్ సాంగ్స్ ను సినిమా మధ్యలో కాకుండా, చివర్లో ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు వేస్తున్నారు. దీనివల్ల జనం ఆ పాటను పూర్తిగా ఆస్వాదించలేక థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు రాజా సాబ్ లోని ఈ మాస్ సాంగ్ కు కూడా అదే గతి పడుతుందేమో అన్న భయం ఆ అభిమానిని వెంటాడింది.

ఆ ఆవేదనను తట్టుకోలేక సదరు అభిమాని ఏకంగా దర్శకుడు మారుతిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో ఒక ఘాటు పోస్ట్ పెట్టాడు. “ఈ పాటను గనక ఎండ్ కార్డ్స్ అప్పుడు పెడితే.. ” అంటూ ఒక బూతు పదాన్ని వాడి మరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ ట్వీట్ లో భాష కాస్త కఠినంగా ఉన్నా, అందులో ఒక డై హార్డ్ ఫ్యాన్ ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత మంచి సాంగ్ మెయిన్ సినిమాలో కాకుండా చివర్లో వస్తే ఎలా అనే ఆక్రోశం అది.

దీనిపై దర్శకుడు మారుతి స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఇలాంటి ట్వీట్స్ ను సెలబ్రిటీలు లైట్ తీసుకుంటారు. కానీ మారుతి మాత్రం తనదైన మాస్ స్టైల్ లో దిగివచ్చారు. “ఇలాంటి లతుకోరు ప్రెడిక్షన్స్ చేస్తే.. నేను కూడా నిన్ను సేమ్ అలాగే చేస్తా” అంటూ ఆ అభిమాని వాడిన పదాన్నే వాడుతూ సెటైరికల్ గా కౌంటర్ వేశారు. దీంతో దర్శకుడికి ఫ్యాన్స్ ఎమోషన్ అర్థమైందని క్లారిటీ వచ్చింది. మారుతి ఇచ్చిన ఈ ఒక్క రిప్లైతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంటే ఈ పాట కచ్చితంగా సినిమా మధ్యలోనే వస్తుందని, ఎండ్ టైటిల్స్ లో రాదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసినట్లయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus