The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతుంది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 10నే ఆ సినిమా రిలీజ్ కావాలి. కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తికాకపోవడం వల్ల వాయిదా వేశారు. డిసెంబర్ 5న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు టీజర్ ద్వారా వెల్లడించారు. ‘ది రాజాసాబ్’ టీజర్ కూడా అదిరిపోయింది.

The Raja Saab

సినిమాపై అంచనాలు పెంచింది. అయితే షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉంది. ముఖ్యంగా సాంగ్స్ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ ఎప్పుడో ట్యూన్స్ ఇచ్చేశాడు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండటం వల్ల అవి ఓల్డ్ అయిపోతాయి అని భావించి.. మళ్ళీ కంపోజ్ చేస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో అతను స్వయంగా వెల్లడించాడు. అలా ‘ది రాజాసాబ్’ సాంగ్స్ వర్క్ పెండింగ్లోనే ఉంది. కథ ప్రకారం ఇందులో 5 పాటలు ఉంటాయి.

పక్కా కమర్షియల్ ఆల్బమ్ ఇది అని మేకర్స్ చెబుతున్నారు.ఇక వాటి పిక్చరైజేషన్ ఇప్పట్లో కంప్లీట్ అయ్యేలా కనిపించడం లేదు.డిసెంబర్ 5 కి ఈ సినిమా వచ్చే అవాకాశాలు లేవు అని భావించి.. చిత్ర బృందం సంక్రాంతికి వాయిదా వేసుకుంది. జనవరి 9న ‘ది రాజాసాబ్’ రిలీజ్ కాబోతున్నట్టు నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించారు. అయితే ఇప్పుడు సంక్రాంతి టైంకి కూడా ‘రాజాసాబ్’ రావడం కష్టంగానే కనిపిస్తుంది.

ఎందుకంటే 2,3 సాంగ్స్ విదేశాల్లో చిత్రీకరించాలట. మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ నిర్వహిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కువగా హాజరుకావడం లేదు అని తెలుస్తుంది. ‘ఫౌజి’ షూటింగ్ పై చూపిస్తున్న ఆసక్తి.. ‘ది రాజాసాబ్’ పై ప్రభాస్ కనబరచడం లేదట. ఈ నేపథ్యంలో 2026 సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ రావడం కష్టం అని అంటున్నారు.

ఒకవేళ అప్పుడు కూడా మిస్ అయితే.. ఇక 2026 సమ్మర్ వరకు రిలీజ్ అయ్యే అవకాశం లేదు. అప్పుడు కూడా చిరంజీవి ‘విశ్వంభర’,త్రివిక్రమ్- వెంకటేష్, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి క్రేజీ సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి.

‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus