రవి తేజ మూవీలో హైలెట్ ఏంటో చెప్పిన డైరక్టర్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ చేసిన “రాజ ది గ్రేట్” సినిమా దీపావళి కానుకగా థియేటర్లోకి రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహ్రిన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాశీఖన్నా స్పెషల్ సాంగ్ తో అదరగొట్టనుంది. రవితేజ అంధుడిగా కనిపించనున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఐదు పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో మరో పాట కూడా ఉందని డైరక్టర్ రావి పూడి తెలిపారు. ఇంట్రవెల్ తర్వాత వచ్చే ఆ పాట సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్పారు. ఆ సాంగ్ ని వెండితెరపై చూస్తేనే బాగుంటుందని ఉద్దేశంతో ఇప్పటివరకు రిలీజ్ చేయలేదని వివరించారు. టీజర్, ట్రైలర్ తో అంచనాలను పెంచిన రాజా ది గ్రేట్ ఈనెల 18 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus