Rajamouli: తన సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న జక్కన్న!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎలాంటి కథతో సినిమాలను తెరకెక్కించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. స్టూడెంట్ నంబర్1 సినిమా నుంచి బాహుబలి2 సినిమా వరకు రాజమౌళి సినిమాసినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ దర్శకుడిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై దాదాపుగా రెండు వారాలవుతున్నా ఈ సినిమా ఇప్పటికీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.

50 డేస్ సెంటర్ల విషయంలో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ జరగగా తారక్, చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ కావాలని కామెంట్లు చేశారు. జక్కన్న మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాతో పెంచిన హీట్ ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ద్వారా చరణ్, తారక్ తో మరింత సమయం గడపడం తనకు సంతోషంగా ఉంటుందని జక్కన్న అన్నారు.

సినిమాలో విజన్ అనేది ప్రేక్షకులు ఆశించిన విధంగా ఉండాలని జక్కన్న కామెంట్లు చేశారు. తాను సినిమాలను ఎప్పుడూ చిన్నపిల్లల కోసమే రాస్తానని పెద్దవాళ్ల కోసం రాయనని రాజమౌళి తెలిపారు. ప్రతి మనిషిలో పిల్లాడు ఉంటాడని అలా సినిమా అందరినీ ఆకట్టుకుని దగ్గరవుతుందని రాజమౌళి కామెంట్లు చేశారు. జక్కన్న తన కామెంట్ల ద్వారా తన సినిమాల సక్సెస్ సీక్రెట్లను రివీల్ చేసేశారు. మహేష్ మూవీతో జక్కన్న బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కళ్లు చెదిరే విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఖర్చు విషయంలో రాజీ పడకుండా కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా కథ విషయంలో విజయేంద్ర ప్రసాద్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 2023 ప్రథమార్థంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus