చరణ్ గురించి రాజమౌళి ఏమన్నాడంటే…!
- March 31, 2020 / 12:58 PM ISTByFilmy Focus
మెగా పవర్ స్టార్ రాంచరణ్ … ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా లో నటిస్తున్నాడు. అల్లూరి సీతా రామరాజు పాత్రలో చరణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుండీ చరణ్ పాత్రకు సంబంధించిన వీడియో గ్లింప్స్ ను ఇటీవల విడుదల చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చరణ్ ను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఇంట్రొడ్యూస్ చేసి.. మాస్ పల్స్ తెలుసుకున్న దర్శకుడని ప్రూవ్ చేసుకున్నాడు.
తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ లో ఈ వీడియో గ్లింప్స్ ను విడుదల చెయ్యగా అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇదిలా ఉండగా… రాజమౌళి తో చరణ్ కు ఇది రెండవ చిత్రం. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘మగధీర’. ఆ చిత్రం వచ్చి 10 సంవత్సరాలు దాటింది.

ఇక అప్పటికీ .. ఇప్పటికీ చరణ్ లో వచ్చిన మార్పులు గురించి రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ…”‘మగధీర’ చరణ్ కు రెండవ సినిమా. అప్పుడు నటన నేర్చుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు నటనలో బాగా పరిణితి చెందాడు. డైరెక్టర్ ఎలా కావాలి అంటే అలా మారి నటించగలుగుతున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్
















