Rajamouli, Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ దిశగా అడుగులు పడనున్నాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. బన్నీ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. తాజాగా బన్నీకి నేషనల్ అవార్డ్ రావడంతో ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి మూవీ తర్వాత ఈ కాంబోలో సినిమా రానుందని తెలుస్తోంది. వేర్వేరు కారణాల వల్ల ఇప్పటివరకు ఈ కాంబోలో సినిమా రాలేదు.

రాజమౌళి సపోర్ట్ లేకపోయినా బన్నీ మాత్రం ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. అల్లు, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు ఇతర భాషల అభిమానుల సపోర్ట్ కూడా ఉండటం అల్లు అర్జున్ కు ఎంతగానో కలిసొస్తోందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. బన్నీ రాజమౌళి కాంబోలో సినిమా ఫిక్స్ అయితే ఆ మూవీ సంచలనం అవుతుంది. సినిమా కోసం ఎంతైనా కష్టపడే టాలీవుడ్ హీరోలలో బన్నీ ముందువరసలో ఉంటారు.

బన్నీ రాజమౌళి (Rajamouli) కాంబో కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీతో జక్కన్న ఒక్క సినిమా తీసినా చాలని అభిమానులు కోరుకుంటున్నారు. పుష్ప ది రైజ్ తో భారీ స్థాయిలో మార్కెట్ ను పెంచుకున్న బన్నీ పుష్ప ది రూల్ తో తన రేంజ్, మార్కెట్ ను రెట్టింపు చేసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి హీరోల టాలెంట్ కు అనుగుణంగా కథలను ఎంచుకుని సినిమాలు తెరకెక్కిస్తారు. మహేష్ సినిమాను హాలీవుడ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్న జక్కన్న భవిష్యత్తు సినిమాలను సైతం అదే స్థాయిలో ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతోందని తెలుస్తోంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus