Akhanda Movie: బాలయ్య ఈవెంట్ కి గెస్ట్ గా జక్కన్న!

  • November 27, 2021 / 12:48 PM IST

నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ’ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం ఈరోజు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని సమాచారం. అయితే ఇప్పుడు మరో స్పెషల్ గెస్ట్ కూడా అటెండ్ అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా..? దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.

ప్రస్తుతం ఆయన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. అలానే సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ రాజమౌళి.. బాలయ్య ఈవెంట్ కి రావడానికి ఓకే చెప్పారు. దీంతో ఈ ఈవెంట్ పై ఆసక్తి మరింత పెరిగింది. దానికి తోడు తమన్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇదంతా చూస్తుంటే ‘అఖండ’ ఈవెంట్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది.

నందమూరి అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus