Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

14 నెలల తర్వాత రావాల్సిన ‘వారణాసి’ సినిమా గురించి సినిమా టీమ్‌ మొన్నీమధ్య మిడ్‌నైట్‌ ప్రచారం చేసింది. హాలీవుడ్‌ మీడియాకు ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను మిడ్‌నైట్‌ రిలీజ్‌ చేసింది. మరి ఆ టైమ్‌ రిలీజ్‌ సినిమా టీమ్‌ ఇష్టమో లేక ఆ ఇంటర్వ్యూ చేసిన మీడియా ఇష్టమో తెలియదు కానీ రాత్రి వచ్చింది. అందులో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అవి సినిమా గురించి ఆసక్తి పెంచేవి కాగా.. ఒక్క విషయం మాత్రం మహేష్‌బాబు ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచే విషయం. అదే మహేష్ ట్రేడ్‌ మార్క్‌ను మార్చేసే ప్రయత్నం.

Varanasi

మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ అంటే ముక్కు మీద వేళ్లు రాయడం, పరిగెత్తడం లాంటివి చెప్పొచ్చు. ముక్కు మీద వేలు రాయడం ఆయన ఇటీవల తగ్గించేశాడు. ఇక మిగిలింది పరిగెత్తడం. ఇతర హీరోల కంటే ఆయన రన్నింగ్‌ డిఫరెంట్‌ ఉంటుంది. ఎప్పుడు ‘పోకిరి’ సినిమాలో పూరి జగన్నాథ్‌ చేసిన మార్పుల వల్ల ఆయన రన్నింగ్‌ అలా డిఫరెంట్‌గా వచ్చింది. అయితేనేం అదతని ట్రేడ్‌ మార్క్‌. అయితే దానిని ఇప్పుడు రాజమౌళి మార్చేశారట. దీని కోసం ఖర్చు కూడా బాగానే అయింది అని సమాచారం.

‘వారణాసి’ సినిమాలో ఓ సీన్‌ కోసం రాజమౌళి ఈ మార్పు చేశారట. ప్రస్తుతం ఉన్న రన్నింగ్‌ స్టైల్‌ తమ సినిమాకు వర్కవుట్‌ కాదని మార్చేసినట్లు సమాచారం. రాముడి పాత్రలో అలా పరిగెత్తితే బాగోదు అని అనుకున్నారో ఏమో ఆరు నెలల కష్టపడి రన్నింగ్‌ స్టైల్‌ మార్చేశారు అని మహేష్‌బాబే ఇటీవల చెప్పుకొచ్చాడు. ఇంత కష్టపడి చేసింది కేవలం రెండు షాట్ల కోసమే అని కూడా చెప్పాడు. మరి దీని కోసం మార్చాలా అంటే.. అక్కడ ఉన్న రాజమౌళి మరి. ఏదైతేనేం మహేష్‌బాబు రన్నింగ్‌లో కొత్త వెర్షన్‌ అయితే చూస్తాం.

ఇక సినిమా విషయానికొస్తే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. మహేష్‌బాబుతోపాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ముఖ్య పాత్రధారులు. కేఎల్‌ నారాయణ, కార్తికేయ కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags