రాజమౌళితో మహేష్ సినిమా ఫిక్స్.. ఇదిగో క్లారిటీ…!

మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు … యావత్ ప్రేక్షకులంతా రాజమౌళి తో మహేష్ బాబు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘బాహుబలి’ (సిరీస్) వంటి ఫాంటసీ మూవీ మహేష్ కు సెట్ అవుతుందా…? ‘మగధీర’ వంటి పునర్జన్మలు వంటి కథకి మహేష్ ఒప్పుతాడా? వంటి ఎన్నో అనుమానాలు ప్రేక్షకుల్లో మెదులుతున్నాయి. మహేష్ తండ్రి కృష్ణ … అల్లూరి సీతారామరాజు సినిమా చేసాడు. అదే పాత్రకి ‘ఆర్.ఆర్.ఆర్’ లో చరణ్ ను సెలెక్ట్ చేసాడు రాజమౌళి.’

‘బిజినెస్ మెన్’ ఆడియో లాంచ్ లో అల్లూరి సీతారామరాజు వంటి సినిమా మహేష్ తో తియ్యాలా అంటే పెద్ద రెస్పాన్స్ రాలేదు.. కానీ జేమ్స్ బాండ్ తరహా సినిమా కావాలా అంటే మాత్రం ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అందుకే అల్లూరి పాత్రకు మహేష్ ను తీసుకోలేదు’ అంటూ రాజమౌళి ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కచ్చితంగా మహేష్ తో సినిమా జేమ్స్ బాండ్ తరహా సినిమా రాజమౌళి తీస్తాడు అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మహేష్ తో సినిమా ఫిక్స్ అని రాజమౌళి తాజాగా అనౌన్స్ చేసేసాడు. ‘కొన్ని వందల సార్లు చెప్పాను… దానయ్య గారితో సినిమా అయ్యాక.. కె.ఎల్.నారాయణ – మహేష్ గారితో సినిమా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. రాజమౌళి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags