Jr NTR, Rajamouli: ఆ లవ్ ట్రాక్ రీషూట్ చేస్తానన్న రాజమౌళి?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు రాజమౌళి భారీ షాక్ ఇచ్చారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలోని ప్రజలు అత్యంత ఆసక్తి చూపిస్తున్న సినిమాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయనున్నట్టు గతంలో వార్తలు రాగా ఎన్టీఆర్ ఒలీవియా మధ్య వచ్చే లవ్ ట్రాక్ ను రాజమౌళి రీషూట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడటానికి రీషూట్ కూడా ఒక కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా ఒలీవియా మోరిస్ బ్రిటిష్ యువరాణిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లతో సినిమాపై అంచనాలు భారీస్థాయిలో పెరగగా జక్కన్న ట్రైలర్ తో ఆ అంచనాలను రెట్టింపు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మేకర్స్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో సినిమా రిలీజ్ డేట్ విషయంలో ప్రేక్షకులు టెన్షన్ పడుతున్నారు.

అయితే త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఆలస్యంగా విడుదలైనా ఊహించని స్థాయిలో హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సన్నివేశాలను రీషూట్ చేస్తూ రాజమౌళి ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చారనే చెప్పాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus