స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మరో ఆరు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నా రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో వెనుకడుగు వేయకూడదని భావిస్తున్నారని బోగట్టా. ఓవర్సీస్ లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు.
తమిళంలో ఆర్ఆర్ఆర్ కు పోటీగా వాలిమై సినిమా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో అజిత్ గురించి ప్రస్తావన రాగా రాజమౌళి మాట్లాడుతూ ఒకసారి తాను రామోజీ ఫిల్మ్ సిటీలోని సితార రెస్టారెంట్ కు భోజనానికి వెళ్లానని లోపలికి వెళ్లిన సమయంలో అజిత్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ కనిపించారని చెప్పుకొచ్చారు. తాను అక్కడికి వచ్చానని ఎవరో చెబితే భోజనం చేస్తున్న అజిత్ మధ్యలో లేచి తన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి లోపలికి తీసుకెళ్లారని రాజమౌళి అన్నారు.
అజిత్ లాంటి స్టార్ హీరో అలా చేయడం ఇబ్బందిగా అనిపించిందని రాజమౌళి తెలిపారు. ఆ తర్వాత తన భార్య రమ వస్తోందని తెలిసి అజిత్ తనను తాను పరిచయం చేసుకోవడంతో పాటు ఆమెను లోపలికి తీసుకొచ్చారని రాజమౌళి కామెంట్లు చేశారు. అజిత్ సింప్లిసిటీ గురించి ఏమని మాట్లాడాలో తనకు అర్థం కావడం లేదని జక్కన్న కామెంట్లు చేశారు. కొన్నిరోజుల క్రితం అజిత్ అభిమానులు ‘తల’ అని పిలుస్తుంటే అలాంటి బిరుదులు వద్దని చెప్పారని అజిత్ కుమార్ అని మాత్రమే పిలవాలని ఆయన చెప్పడం గొప్ప విషయం అని జక్కన్న వెల్లడించారు.
అజిత్ కు హ్యాట్సాఫ్ అని రాజమౌళి పేర్కొన్నారు. వరుస ప్రమోషన్లతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచేశారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!