రాజమౌళి ఇంట్రెస్టింగ్ థింగ్స్

ఎస్.ఎస్.రాజమౌళి .. పరిచయం అక్కర్లేని పేరు. స్టూడెంట్ నంబర్ 1 గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి పదో చిత్రానికి నంబర్ వన్ డైరక్టర్ గా ఎదిగారు. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ దర్శకధీరుడు నేడు (అక్టోబర్ 10) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ .. రాజమౌళి గురించి కొన్ని ఆసక్తకర సంగతులు వెల్లడిస్తున్నాం.

హీరో కావాలని పూజలురాజమౌళి కుర్రోడిగా ఉన్నప్పుడు సినీ హీరో అవ్వాలని కలలు కనేవారు. ఆ విషయం ఎవరికైనా చెబితే నవ్వుతారని రహస్యంగా పూజలు చేసేవారు. సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మెల్లగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు.

జక్కన్నప్రతి ఫ్రేమ్ ని చెక్కుతాడని రాజమౌళికి జక్కన్న అని పేరు వచ్చింది. ఈ పేరుతో మొదటిసారి పిలిచింది నటుడు రాజీవ్ కనకాల. శాంతి నివాసం సీరియల్ డైరక్ట్ చేసేటప్పుడే ఈ పేరు పెట్టారు.

మగధీరమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చెయ్యమని రాజమౌళి ని చిరంజీవి కోరారు. మొదటి సినిమా లవ్ స్టోరీ అయితే బాగుంటుందని చిరు చెబితే.. ప్రేమకథ నేను చెయ్యను .. తర్వాతి సినిమా చేస్తాను అని మగధీర తీశారు.

విక్టరీ తో ఎప్పుడో..యమదొంగ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలనీ రాజమౌళి అనుకున్నారు. ఎందుకనో అప్పుడు అది సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పటివరకు మళ్లీ వారిద్దరూ కలవలేదు.

సొంత సంస్థకొన్నేళ్ళక్రితం రాజమౌళి విశ్వామిత్ర బ్యానర్ ని స్థాపించారు. ఆ బ్యానర్లో సినిమాలు నిర్మించాలని అప్పట్లో అనుకున్నారు. కానీ ఈ సంస్థ నుంచి ఒక సినిమా కూడా రాలేదు.

విశాఖ ఎక్స్ ప్రెస్అల్లరి నరేష్, రాజీవ్ కనకాల నటించిన విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాను ఎస్.ఎస్.రాజమౌళి సమర్పించారు. దర్శకధీరుడు సమర్పకుడిగా కనిపించిన తొలి సినిమా ఇది.

ట్రాఫిక్ నియంత్రణ2011, డిసెంబర్ 31 రాత్రి 10.30 నుంచి 2 గంటల వరకు భార్య రమతో కలిసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద రాజమౌళి ట్రాఫిక్ నియంత్రించారు. తాగి వాహనాలను నడపవద్దని పామ్లెట్స్ ని పంపిణీ చేశారు. ఇలా ట్రాఫిక్ నియమాలపై నాలుగు గంటల పాటు అవగాహన కల్పించారు.

హీరోని చేసిన ఒక్క కామెంట్సంపూర్ణేష్ నటించిన హృదయకాలేయం సినిమా పోస్టర్స్ ని చూసి “మంచి ప్రయత్నం. బాగా కష్టపడుతున్నాడు” అని రాజమౌళి చేసిన ఒక కామెంట్ ఆ చిత్రానికి ప్రాణం పోసింది. ఆ సినిమా రిలీజ్ కావడానికి, సంపూ హీరో కావడానికి ప్రధాన కారణం అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus