RRR Movie: ఎన్టీఆర్ ఫిక్సయ్యారు.. చరణ్ కే సమస్య..?

  • June 18, 2021 / 01:33 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి సాధారణంగా సినిమాలను నిదానంగా తెరకెక్కిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో పేరుంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఆలస్యం కావడంతో ఈ సినిమాల్లో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, చరణ్ లకు క్లారిటీ ఇచ్చేశారని కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ జరగనుందని సమాచారం.

అయితే సినిమా షూటింగ్ పూర్తైనా విజువల్ ఎఫెక్ట్స్ కు మాత్రం ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జులై చివరి వారం నాటికి ఆర్ఆర్ఆర్ హీరోల పాత్రలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ పూర్తవుతుందని భోగట్టా. ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగష్టు నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు కియారా అద్వానీ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అయ్యారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. అయితే చరణ్ కు మాత్రం శంకర్ లీగల్ సమస్యల్లో చిక్కుకోవడం వల్ల తరువాత సినిమా షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. చరణ్ మరో డైరెక్టర్ తో సినిమాను స్టార్ట్ చేయాలని భావిస్తుండగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus