RRR Realese Date: జక్కన ప్లాన్ కి తలలు పట్టుకున్న నిర్మాతలు!

రాజమౌళి సినిమాలు ఓ పట్టాన విడుదల కావు. ఏళ్లకు ఏళ్లు షూటింగ్ లు చేస్తూనే ఉంటారు. పెర్ఫెక్షన్ కోసం సినిమాలను చెక్కుతూనే ఉంటారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. దానికి తోడు కరోనా రావడంతో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. 2020లో సినిమాను విడుదల చేస్తామన్నారు. అలా జరగలేదు. ఈ ఏడాది దసరాకు వస్తుందని చాలా నమ్మకంగా చెబుతున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాదిలో కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉండదట.

తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అక్టోబర్ నెలాఖరుకి గానీ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కాదట. అందుకే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ దసరాకి వస్తుందని అనౌన్స్ చేయడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఇలా చాలా సినిమాలు సంక్రాంతి రేసులోకి వచ్చాయి.

ఇప్పుడు రాజమౌళి మళ్లీ తన సినిమా డేట్ ని మార్చుకొని సంక్రాంతికి రావాలని చూస్తుండడంతో మిగిలిన చిత్ర నిర్మాతల పరిస్థితి అయోమయంగా మారింది. నిర్మాత దానయ్య సింపుల్ గా నిర్మాతలకు ఫోన్ చేసి జనవరి 8న సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఊరుకుంటున్నారట. కనీసం ఎవరినీ రిక్వెస్ట్ చేయకుండా.. ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తున్నారట. మరిప్పుడు సంక్రాంతికి రావాలనుకున్న సినిమాల పరిస్థితి ఏమవుతుందో..!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus