అక్టోబర్ నెల చివరి వారం నాటికి ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయని తెలుస్తోంది. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కాకపోవడంతో తాత్కాలికంగా ప్రమోషన్స్ కు బ్రేక్ ఇచ్చిన జక్కన్న వచ్చే ఏడాది సమ్మర్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్లతో క్లాష్ కాకుండా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను ప్రకటించాలని జక్కన్న భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ 550 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం 1,000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలి.
బాహుబలి2 సినిమా సులువుగానే ఈ రికార్డును సాధించగా ఆ సినిమా రిలీజ్ సమయంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చరణ్, తారక్ ఈ సినిమాతో బాక్సాఫీస్ స్టామినాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. జక్కన్న తను క్రియేట్ చేసిన రికార్డులను తనే అధిగమించాల్సిన పరిస్థితి నెలకొనగా ఆ రికార్డును సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. చరణ్, ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైన సంగతి తెలిసిందే. 2022లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా ఏ తేదీకి ఈ సినిమా రిలీజవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అలియా భట్, ఒలీవీయా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా శ్రియ, అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!