‘ఆర్.ఆర్.ఆర్’ కి ‘బాహుబలి’ ఫార్ములాని అప్లై చేస్తున్న రాజమౌళి..?

  • December 29, 2018 / 11:47 AM IST

రాంచరణ్, జూ. ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్ళి సందర్భంగా కొంచెం బ్రేక్ తీసుకుని… జనవరి తరువాత తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.

రాజమౌళి ఈ చిత్రానికి కూడా ‘బాహుబలి’ చిత్రంలానే రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నాడంట. దీని నిర్మాతలకు మరిన్ని లాభాలు తీసుకొచ్చే విధంగా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం మొదలుపెట్టినప్పుడు కూడా రాజమౌళి రెండు భాగాలు చేయాలనీ భావించలేదు. షూటింగ్ మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిత్రం రషెస్ చూసి రెండు భాగాలుగా తీయాలనే ఆలోచనతో నిర్మాతలను ఒప్పించాడట. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా అదే రిపీట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర కథ ప్రకారం చూసుకుంటే 1930, అలాగే ప్రస్తుతం పరిస్థితులను బట్టి సాగే కథాంశం కాబట్టి రెండు టైమ్ పిరియడ్స్ లో జరిగే సినిమాను రెండు భాగాలుగా చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. మరి ఇది ఎంత వరకూ నిజమనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus