Rajamouli: హీరోల ఫ్లాపులపై జక్కన్న షాకింగ్ కామెంట్స్ వైరల్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే ఆ హీరో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధిస్తారనే సంగతి తెలిసిందే. స్టూడెంట్ నంబర్ 1లో ఎన్టీఆర్ నుంచి బాహుబలి2 సినిమాలో ప్రభాస్ వరకు తన సినిమాలతో అందరు హీరోలకు జక్కన్న బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. అయితే జక్కన్న సినిమాలో నటించిన హీరోల తర్వాత సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఈ బ్యాడ్ సెంటిమెంట్ రాజమౌళి డైరెక్షన్ లో నటించే హీరోలను తెగ టెన్షన్ పెడుతోంది.

Click Here To Watch NEW Trailer

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళికి ఈ ప్రశ్న ఎదురు కాగా ఈ ప్రశ్నకు సంబంధించి జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ ప్రశ్న చాలా సంవత్సరాల నుంచి ఎదురవుతోందని 20 సంవత్సరాలుగా ఈ ప్రశ్నకు తాను జవాబు చెబుతూనే ఉన్నానని జక్కన్న అన్నారు. తాను ఇప్పటికే ఆన్సర్ చెప్పినా తనకు ఈ ప్రశ్న మళ్లీమళ్లీ ఎదురవుతోందని జక్కన్న కామెంట్లు చేశారు. ఒక సినిమా ఫ్లాప్ కావడానికి అనేక కారణాలు ఉంటాయని రాజమౌళి తెలిపారు.

ఒకే విషయానికి ముడిపెట్టి చూడకూడదని జక్కన్న చెప్పుకొచ్చారు. తన హీరోల తర్వాత సినిమాల ఫ్లాపులకు తనకు ఎలాంటి సంబంధం లేదని జక్కన్న పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి ఆ ప్రశ్నకు సమాధానం చెబుతున్న సమయంలో చరణ్, తారక్ బ్లాంక్ ఫేస్ పెట్టి ఒకరి మొహాలు మరొకరు చూసుకోవడం గమనార్హం. రాజమౌళి సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధిస్తోన్న హీరోలు తర్వాత సినిమాలతో మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటున్నారు. ఇప్పటివరకు ఏ హీరో కూడా ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేదు.

చరణ్, తారక్ తర్వాత సినిమాలతో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఆర్ఆర్ఆర్ సినిమా నిడివి ఎక్కువ కావడంతో సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించే టైమింగ్స్ మారాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus