RRR Movie: రాజమౌళి ఆ హీరోలను కూడా తీసుకొస్తాడట!

నిజానికి సినిమా చివర్లో వచ్చే రోలింగ్ టైటిల్స్ సమయంలో ఏం చూపించాలనే విషయంలో మేకర్లు పెద్దగా ఆసక్తి చూపరు. షూటింగ్ సమయంలో ఏవైనా మేకింగ్ విజువల్స్ ని చూపించేసి ఊరుకుంటారు. లేదంటే ఓన్లీ టైటిల్స్ వేసి లైట్ తీసుకుంటారు. కానీ దర్శకుడు రాజమౌళి అక్కడ కూడా తన మార్కు చూపించాలని నిర్ణయించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించిన ప్రచార గీతాన్ని రెడీ చేస్తున్నాడు రాజమౌళి. కథకు ఈ పాటకు ఎలాంటి సంబంధం ఉండదు.

కేవలం ప్రమోషన్స్ కోసం వాడతారంతే. తరువాత సినిమా చివర్లో రోలింగ్ టైటిల్స్ మీద ఈ పాట వేస్తారు. ఇప్పుడు ఈ పాటను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాడు రాజమౌళి. దీనికోసం రెండు భారీ సెట్స్ ను రెడీ చేశాడు. ఒక సెట్ లో షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై కొన్ని మాంటేజ్ సీన్స్ తీస్తున్నారు. ఈ పాటలో హీరో, హీరోయిన్లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబందించిన టెక్నీషియన్స్ అందరూ కనిపిస్తారు.

లైట్ బాయ్ తో సహా అందరినీ ఈ పాటలో చూపించాలని రాజమౌళి ప్లాన్. అయితే ఇక్కడితో అఆగిపోలేదు. ఈ ప్రమోషనల్ సాంగ్ లో తన గత చిత్రాల హీరోలను కూడా చూపించాలని అనుకుంటున్నాడు రాజమౌళి. ఈ క్రమంలో ప్రభాస్, రవితేజ లాంటి హీరోలకు సందేశాలు పంపించినట్లు సమాచారం. వీళ్లతో పాటు నితిన్, నాని, సునీల్ లాంటి హీరోలు కూడా కనిపిస్తారట. ఇదే గనుక జరిగితే సినిమాకి ఈ పాట మరో ఎట్రాక్షన్ కావడం ఖాయం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus