చిరంజీవి 151 మూవీ పోస్టర్ ని రిలీజ్ చేయనున్న రాజమౌళి

స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాని చేస్తున్నారు.  ఈ చిత్రం  పూజా కార్యక్రమాలు జరుపుకొని సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ లోగోని చిరు పుట్టిన రోజు (ఆగస్టు 22 )న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మోషన్ పోస్టర్ ని దర్శకధీరుడు రాజమౌళి ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ ఫిలిం కి స్క్రిప్ట్ వర్క్ లో జక్కన్న హస్తం ఉందని, సినిమా విషయంలో చిరంజీవి రాజమౌళి సలహా తీసున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఆయన చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేస్తుండడంతో ఇప్పుడు ఆ వార్తలు  నిజమేనని స్పష్టం అయ్యాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ సూపర్ స్టార్ సుదీప్, కోలీవుడ్ సూపర్ హీరో విజయ్ సేతు పతిలు కీలక రోల్స్ పోషించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ? ఇంకా సస్పెన్స్ గా ఉంది. త్వరలో ఆ విషయంలోను క్లారిటీ రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus