Rajasekhar: ‘మాన్‌స్ట‌ర్‌’గా రాజశేఖర్!

సీనియర్ హీరో రాజశేఖర్ ఓ యాక్షన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు పవన్ సాధినేని ఈ సినిమాను రూపొందించబోతున్నారు. రాజశేఖర్ కెరీర్ లో 92వ సినిమా ఇది. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాజశేఖర్, పవన్ సాధినేని కాంబినేషన్ లో సినిమా గురించి కొన్ని రోజులుగా ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి ‘మాన్‌స్ట‌ర్‌’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

రాజశేఖర్ క్యారెక్టర్ కి తగ్గట్లుగా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా జిబ్రాన్ కి మంచి పేరుంది. కోలీవుడ్ లో ఎన్నో హిట్టు సినిమాలకు పని చేశారాయన. ప్రభాస్ ‘సాహో’ సహా కొన్ని తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించారు. ఇప్పుడు రాజశేఖర్ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు పవన్ మాట్లాడుతూ..

‘సేనాపతి’ సినిమాతో యాక్షన్ ఫ్లేవర్ రుచి చూశానని, ఇపుడు యాక్షన్ పై మరింత ప్రేమ పెరిగిందని.. రాజశేఖర్ తో చేయబోయే ఈ సినిమా యాక్షన్ అభిమానులకు ఐఫీస్ట్ అవుతుందని చెప్పారు. కరోనా తరువాత రాజశేఖర్ నుంచి ‘శేఖర్’ అనే సినిమా వచ్చింది. దీన్ని జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేశారు. మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus