ఏ మాయ చేశావె సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన సమంత వివాదాలకు దూరంగా ఉంటూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర వల్ల సమంతపై కోలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజీ పాత్రకు సంబంధించి సమంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా విమర్శలు మాత్రం ఆగలేదు. మరి కొందరు సమంత సారీ చెప్పాలని డిమాండ్ చేసినా సమంత మాత్రం ఏ తప్పు చేయకుండా సారీ చెప్పడానికి ఇష్టపడలేదు.
అయితే ఈ వివాదం వల్ల సమంతకు ఇకపై తమిళంలో హీరోయిన్ ఆఫర్లు రాకపోవచ్చని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సమంత దాదాపు అందరు కోలీవుడ్ హీరోలతో నటించారు. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా సమంతపై తమిళంలో బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రాజీ పాత్ర వల్ల సమంతకు కష్టాలు తప్పవని వార్తలు వస్తున్నాయి. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం సమంత దర్శకులు ఆఫర్ చేసిన పాత్రలో నటించారే తప్ప ఆమె ఏ తప్పు చేయలేదని అభిప్రాయపడుతున్నారు.
సమంతకు తమిళంలో కొత్త ఆఫర్లు వస్తాయో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. మరోవైపు నెటి ఫిక్స్ సమంత ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ ను నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ లకు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తుండటంతో సమంత వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.