‘2.0’ మరో రికార్డ్ కైవసం చేసుకుంది..!

Advertisement

రజనీకాంత్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.0’ ఇంకా జోరు కొనసాగిస్తూనే ఉంది. అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ చిత్రం హిందీ లో కూడా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో విడుదలయ్యే సినిమాలకు కలెక్షన్లు పెద్దగా ఉండవు అనే సంగతి తెలిసిందే. అయితే ‘2. 0’ చిత్రం ‘బాహుబలి’ కలెక్షన్స్ ను అధిగమించనప్పటికీ మంచి ఓపెనింగ్స్ మాత్రం నమోదు చేయడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మరో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది.

తాజాగా ఈ చిత్రం 700 కోట్లను (100 మిలియన్ డాలర్స్)ను వసూలు చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టిన చిత్రాలు 53 మాత్రమే. ఈ జాబితాలో ఇండియా నుండీ 2 సినిమాలు మాత్రమే ఉండటం గమనార్హం. ఒకటి ఆమిర్ ఖాన్ నటించి,నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ .. మరొకటి రజనీ-శంకర్ ల ‘2.ఓ’ కావడం విశేషం. అయితే ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చైనా వసూళ్లతో కలుపుకుని ఈ జాబితాలో చేరింది. ‘2.ఓ’ మాత్రం చైనా వసూళ్లతో సంబంధం లేకుండగానే ఈ జాబితాలో చేరడం ఆశ్చర్యపరిచే విషయం. ఏదేమైనా ‘2.0’ మాత్రం మరో అరుదైన రికార్డు ను సొంతం చేసుకుని రజినీ – శంకర్ స్టామినాని మరో సారి బాక్సాఫీస్ కు రుచి చూపించిందనే చెప్పాలి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus