టాలీవుడ్ స్టార్ హీరోస్ గురించి రజనీకాంత్ ఏమన్నారో తెలుసా!

  • June 5, 2018 / 06:03 PM IST

సూపర్ స్టార్ అనేది ఒక బిరుదు మాత్రమే కాదు ఒక గౌరవం, ఆ గౌరవం ఒక పది సినిమాలు హిట్ అయితేనో, ఎక్కువ డబ్బు సంపాదిస్తేనో రాదు, అది వ్యక్తిత్వం బట్టి వస్తుంది. ఊరికే సూపర్ స్టార్లు అయిపోతారా చెప్పండి. దానివెనుక బోలెడంత కష్టం, సాధన ఉంటాయి. అయితే.. మిగతా హీరోల విషయంలో తెలియదు కానీ.. రజనీకాంత్ ను మాత్రం ఆయన సింప్లిసిటీని చూసే ఇష్టపడతారు, ఆరాధిస్తారు. నిన్న హైద్రాబాద్ లో జరిగిన “కాలా” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ధనుష్ కాలా సినిమాలో రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. “రజనీకాంత్ ఒక్కరే” అని పేర్కొన్నప్పుడు రజనీ వెంటనే స్పందించి రజనీకాంత్ మాత్రమే కాదు “చిరంజీవి ఒక్కడే, బాలకృష్ణ ఒక్కడే, నాగార్జున ఒక్కడే, వెంకటేష్ ఒక్కడే. అందరికీ ఒక ఇమేజ్ ఉంది. వారిలానే నేను కూడా” అంటూ తన తోటి హీరోలను తనతోపాటు కలుపుకోవడం అనేది అన్నీ హీరోల అభిమానుల్ని అమితంగా ఆకట్టుకొంది.

ఇకపోతే.. రజనీ “కాలా” చిత్రం జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా.. నేడు ఈ సినిమా కర్ణాటకలో కూడా విడుదలయ్యేలా హైకోర్ట్ తీర్పు ఇవ్వడంతోపాటు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ప్రకటించడంతో ఆనందలో మునిగితేలుతున్నారు కాలా యూనిట్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus