అనుష్కకు కాల్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్!

అరుంధతి.. దేవసేన.. భాగమతి.. ఈ పాత్రలు అనుష్కకోసమే పుట్టినట్లు ఉన్నాయి. ఈ పాత్రలకు అనుష్క ప్రాణం పోశారు. బాహుబలి తర్వాత స్వీటీ ఏడాది పాటి కస్టపడి చేసిన భాగమతి సినిమా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనవరి 26 న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అశోక్ డైరక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ వారం రోజుల్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 16 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఈ సినిమాని చూసిన అభిమానులతో పాటు సినీ స్టార్స్ కూడా అనుష్క నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. రెండు రోజుల క్రితం రామ్ చరణ్ దంపతులు ఈ సినిమాని చూసి ట్విట్టర్ వేదికపై స్వీటీని అభినందనలతో ముంచెత్తారు.

తాజాగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ భాగమతిని చూసి స్వయంగా అనుష్కకి ఫోన్ చేయడం విశేషం. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అనుష్క ఈ విషయాన్ని వెల్లడించింది. ”   రజనీకాంత్ సార్ నుంచి నాకు సర్ ప్రైజ్ కాల్ వచ్చింది. ఆయన భాగమతిలో నా నటన బాగుందచి చెప్పడం చాలా థ్రిల్ ఫీలయ్యాను” అని చెప్పింది. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఓవర్సీస్ లోను మంచి వసూళ్లను సాధిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus