రానా కోరికను మన్నించిన రజనీకాంత్!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో సారి సైన్టిస్ట్ వశీకరణ్ గా చేసిన సినిమా 2 .O . శంకర్ 3డీ లో తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్ష‌య్ కుమార్‌ విలన్ గా నటిస్తున్నారు. దాదాపు 500 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.  ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఆయన కంపోజ్ చేసిన పాటలను దుబాయ్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకకు హీరో దగ్గుబాటి రానా, ఫిలిం మేకర్ కర‌ణ్‌జోహార్ లు హోస్ట్ గా వ్యవహరించారు.  తమ మాటలతో అలరించారు.

ఈ వేదికపై రజనీని రానా ఓ కోరిక కోరారు. “సార్‌.. నేను మిమ్మ‌ల్ని అడిగేంత పెద్ద‌వాణ్ని కాదు. అయినా అడుగుతున్నాను. తెలుగు వాళ్ల కోసం ఓ డైలాగ్ చెప్పండి సార్‌” అని అడిగారు. దానికి ర‌జ‌నీ సంతోషంగా “నేను ఒక్క‌సారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్టే” డైలాగ్ ని చెప్పి హాల్ ని చప్పట్లతో నింపారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన 2 .O లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుడిని కొత్తలోకానికి తీసుకెళ్లనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా రోబో ప్రపంచం మెస్మరైజ్ చేస్తుందని వివరించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus