Rajinikanth: రజినీకాంత్‌కు కోపం తెప్పించిన ప్రశ్న.. అందరిముందే కౌంటర్!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth)  ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ (Coolie)   సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల థాయిలాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రజినీకాంత్, తన బిజీ షెడ్యూల్‌లో భాగంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు, రిపోర్టర్లను పలకరించారు. అయితే ఈ సందర్భంగా జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రజినీకాంత్‌కు సంబంధించిన తాజా సినిమా అప్‌డేట్ గురించి రిపోర్టర్లు ఆసక్తిగా ప్రశ్నలు వేస్తుండగా, ఒక్క రిపోర్టర్ మాత్రం తమిళనాడు మహిళా భద్రతపై తన అభిప్రాయాన్ని అడిగాడు.

Rajinikanth

ఈ ప్రశ్నకు రజినీకాంత్ ఊహించని కౌంటర్ ఇచ్చారు. “సమయానికి తగ్గ ప్రశ్నలు అడగండి. సందర్భం ఉండదా అంటూ ఆ రిపోర్టర్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారు అంటూ అక్కడ నుంచి వెళ్లి పోవడం జరిగింది. దీంతో అక్కడి మిగతా రిపోర్టర్లు కంగుతిన్నారు. ఇటీవల చెన్నైలో ఓ విద్యార్థిని మీద దాడి జరగడం, ఆ ఘటనపై రాజకీయ విమర్శలు రావడంతో హాట్ టాపిక్ గా మారింది.

అయితే రజినీకాంత్ పొలిటికల్ కు సంబంధం ఉన్న టాపిక్స్ కు మరింత దూరంగా ఉన్నట్లు మరోసారి రుజువైంది. రజినీకాంత్ స్పందనపై కొందరు ఆయన తీరు సరిగ్గా లేదని విమర్శించగా, మరికొందరు మాత్రం ఇది ఆయన కరెక్ట్ రియాక్షన్ అని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే కూలీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్ గత చిత్రం వేట్టయాన్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఈ సినిమాతో అభిమానులకు మరోసారి కిక్ ఇవ్వాలని టీం ప్రయత్నిస్తోంది.

రజినీకాంత్ మాఫియా నేపథ్యంలో సరికొత్త అవతారంలో కనిపించనున్నారని సమాచారం. ఇక తమిళనాట రాజకీయాలు, సామాజిక అంశాల గురించి తరచూ స్పందించే రజినీకాంత్, ఈసారి మాత్రం తన ఫోకస్ పూర్తిగా సినిమాపైనే ఉంచినట్లు కనిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus