Rajinikanth: ఆకలితో అలమటించిన సూపర్ స్టార్?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయస్సులో కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. కర్ణాటకలో జన్మించిన రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. అయితే సినిమాల్లోకి రాకముందు రజినీకాంత్ ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయి. ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన తనికెళ్ల భరణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాను రజినీకాంత్ జీవిత చరిత్రను ఆరు వారాలు రాశానని

రాగిముద్ద అదనంగా పెట్టమంటే వాళ్ల అమ్మ పెట్టేది కాదని కావాలంటే తన రాగిముద్ద తీసుకోమని రజినీకాంత్ కు చెప్పేవారని తనికెళ్ల భరణి అన్నారు. కేవలం ఆరు రాగి ముద్దలు మాత్రమే చేశానని రజినీకాంత్ కు తల్లి చెప్పేవారని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. అలాంటి దరిద్రాన్ని రజినీకాంత్ అనుభవించారని ఆ దరిద్రం రజినీకాంత్ కు జాగ్రత్తలు నేర్పిందని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. డబ్బు పట్ల రజినీకాంత్ కు ఆ విధంగా గౌరవం వచ్చిందని తనికెళ్ల భరణి అన్నారు. డబ్బులు ఎక్కువగా సంపాదించిన వాళ్ల పిల్లలకు ఈ జాగ్రత్తలు, గౌరవం తెలియకపోవచ్చని తనికెళ్ల భరణి తెలిపారు.

సినిమా వాతావరణం తనకు దురలవాట్లను నేర్పలేదని తనికెళ్ల భరణి పేర్కొన్నారు. సిగరెట్ మానేశాక తాను ఆరోగ్యంగా ఉన్నానని ఏవియస్, బ్రహ్మానందం, మరికొందరికి ఏ దురలవాట్లు లేవని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. తనికెళ్ల భరణి సినిమాల్లో ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తుండగా దీపావళికి అన్నాత్తే మూవీ రిలీజ్ కానుంది.


పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus